నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించిన పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులను కలిసి వారి సంతోషాల్లో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ, ఆత్మీయులను కలుసుకుని వారి కుటుంబ శుభకార్యాల్లో పాల్గొని, వారి ఆనందంలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు.
నూతన దంపతుల దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యం, ప్రేమాభిమానాలు, సుఖసంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
అయుష్ 24 న్యూస్
The Voice of Truth



Mahamood Mohammed






Leave a Reply