స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకిన యువకుడు మృతి
హైదరాబాద్ (ప్రతినిధి), సెప్టెంబర్ 18: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకడంతో ఓ యువకుడు మృతి చెందినట్లు సమాచారం.
మృతుడిని రాంనగర్‌కు చెందిన మనోజ్‌గా చిక్కడపల్లి పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. మనోజ్ శివం రోడ్‌లోని అపోలో డయాగ్నొస్టిక్ సెంటర్లో పనిచేస్తున్నట్లు సమాచారం. ఇంటింటికీ వెళ్లి రక్త నమూనాలు సేకరించే విధులు నిర్వహించేవాడని తెలిసింది.
ఘటనపై సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని తదుపరి చర్యల నిమిత్తం తరలించినట్లు సమాచారం.
యువకుడు ఈ ఘటనకు పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.










Leave a Reply