ఉత్తర తెలంగాణ రైల్వే అభివృద్ధిపై నిరంతరం ఫాలోఅప్ చేస్తున్న ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లి, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): హైదరాబాద్‌ను పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాలతో అనుసంధానం చేసే రైలు కనెక్టివిటీకి సంబంధించిన అంశంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ స్పందించారు. ఈ పరిణామాన్ని పెద్దపల్లి, మంచిర్యాల ప్రజలతో పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
గత పదేళ్లుగా పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో రైల్వే అభివృద్ధి, కనెక్టివిటీ విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే డిమాండ్లు, రైళ్ల నిలుపుదల అంశాలపై నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణకు మెరుగైన రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తే ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యాపారం, ఉద్యోగాలు, విద్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆయన అన్నారు.
దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ రైలు కనెక్టివిటీ పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని తెలిపారు.
ఈ కనెక్టివిటీ ఒక్కసారి మాత్రమే కాకుండా రెగ్యులర్ రైలుగా కొనసాగి, తెలంగాణ ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉండాలని ఎంపీ వంశీకృష్ణ ఆకాంక్షించారు.
“మెరుగైన కనెక్టివిటీ… మరింత అభివృద్ధికి బాట. ఉత్తర తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతర కృషి కొనసాగుతుంది” అని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు.



Musini.Anjan





Leave a Reply