మంథని నియోజకవర్గంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మంథని: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంథని నియోజకవర్గ కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జెండా గద్దె వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు, మిఠాయిలు పంపిణీ చేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయిలి ప్రసాద్ మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న సుదీర్ఘ బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొందిందని, ఈ స్వేచ్ఛ కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు.
మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ తదితర స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను స్మరించుకోవాల్సిన రోజు ఇదని తెలిపారు. అహింసా ఉద్యమాలు, సత్యాగ్రహాలు, ఉప్పు సత్యాగ్రహం, విప్లవ పోరాటాల ద్వారా స్వాతంత్ర్య ఉద్యమం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిందన్నారు.
స్వాతంత్ర్యం అంటే కేవలం జెండా ఎగురవేయడం మాత్రమే కాదని, చదువు, పరిశుభ్రత, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.
కులం, మతం, భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరూ “మనం భారతీయులం” అనే భావనతో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మనకు లభించిన స్వేచ్ఛను కాపాడుకోవడంతో పాటు దేశ సమైక్యత, సమగ్రతను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
🇮🇳 గర్వంగా చెప్పు… నేను భారతీయుడిని!
స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘన నివాళి. 🙏
కాషాయం – త్యాగానికి ప్రతీక
తెలుపు – శాంతికి ప్రతీక
ఆకుపచ్చ – అభివృద్ధికి ప్రతీక
🇮🇳 ఇదే మన తిరంగా… ఇదే మన గర్వం!
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, వివిధ విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
🇮🇳 జై హింద్ | జై భారత్ 🇮🇳
AYUSH 24 NEWS
THE VOICE OF TRUTH
#Ayush24News #Manthani #IndependenceDay2026 #Congress #AayiliPrasad #JaiHind #JaiBharat #TelanganaNews










Leave a Reply