సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17కు భారతదేశంతో పాటు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడం చారిత్రక పరిణామమని పేర్కొన్నారు. ప్రజల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు తెలంగాణ సమాజం ప్రయాణం సాగిందన్నారు.
గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని రవీంద్ర కుమార్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం గిరిజనుల సామాజిక, విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయమని అన్నారు.
అలాగే 3,146 తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. తండాలకు ప్రత్యేక గుర్తింపు కల్పించడంతో పాటు స్థానిక పరిపాలనా అవకాశాలు పెరిగాయని తెలిపారు. మిషన్ భగీరథ, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో తండాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతుకకు, ప్రజల ప్రశ్నించే హక్కుకు రక్షణ ఉండాలని రవీంద్ర కుమార్ అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని కోరారు. ప్రస్తుత పాలనలో ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ ప్రజల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడుతుందని రమావత్ రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు.
— Ayush 24 News | The Voice of Truth
🇮🇳 జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో రమావత్ రవీంద్ర కుమార్ నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు
సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17కు భారతదేశంతో పాటు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply