అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన క్రీడాకారులు, కళాకారులు
దేవరకొండ: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన జెండా వందనం కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు NVT సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం సమర్పించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని అన్నారు. హక్కులను అనుభవించడంతో పాటు బాధ్యతలను నెరవేర్చడమే నిజమైన స్వాతంత్ర్యం అని పేర్కొన్నారు.
క్రీడలు, కళలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, రాపోలు నిరంజన్, బత్తుల అమర్, భాస్కర్ రెడ్డి, తాళ్ల సురేష్, వంగూరు వెంకటేశ్వర్లు, వల్లమళ్ల ఆంజనేయులు, సముద్రాల వెంకన్న, జగదీశ్వర్ ఆచారి, కరాటే మాస్టర్ గోపి, మాకం మహేష్, శ్రీనయ్య, నరేష్, బాలాజీ, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు, అశోక్ సార్, సురేష్, రాము, క్రీడాకారులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

🇮🇳 SBI దేవరకొండ శాఖలోనూ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
దేవరకొండ SBI శాఖలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకున్నారు.
🇮🇳 జై హింద్ | వందే మాతరం 🇮🇳
AYUSH 24 NEWS
THE VOICE OF TRUTH
#Ayush24News #Devarakonda #SportsAssociation #IndependenceDay2026 #SBI #JaiHind #VandeMataram










Leave a Reply