హైదరాబాద్ BHELలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హైదరాబాద్: BHELలోని అవధూత దత్త పీఠం వారి శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ దుద్దిళ్ల శ్రీను బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన దుద్దిళ్ల శ్రీను బాబుకు ఆలయ కార్యవర్గం తరఫున ట్రస్టీ రాజవరం శచీంద్ర, ఆలయ మేనేజర్ వాసుతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
🇮🇳 జై హింద్ | వందే మాతరం 🇮🇳
AYUSH 24 NEWS
THE VOICE OF TRUTH
#Ayush24News #DuddillaSrinuBabu #IndependenceDay2026 #TPCC #BHEL #Hyderabad #JaiHind










Leave a Reply