జాతీయ జెండాను ఎగురవేసిన సిల్వర్ జూబ్లీ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
దేవరకొండ: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సిల్వర్ జూబ్లీ క్లబ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ, వారి త్యాగాలను నేటి తరానికి ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు తిప్పర్తి రుక్మారెడ్డి, గుర్రం నిరంజన్, గుంజ వాసు, నక్క వెంకటేష్, సయ్యద్ దస్తగిర్, రాములు, అంకూరి దానయ్య, అలాగే DCM సభ్యులు ఇలియాజ్, ఖదీర్, బొడ్డు తదితరులు పాల్గొన్నారు.
🇮🇳 జై హింద్!
🇮🇳 వందే మాతరం!
AYUSH 24 NEWS
THE VOICE OF TRUTH
#Ayush24News #Devarakonda #IndependenceDay2026 #SilverJubileeClub #JaiHind #VandeMataram










Leave a Reply