నగదు చెల్లింపుల వైపు మొగ్గు చూపుతున్న పెట్రోలియం డీలర్ల అసోసియేషన్
అమరావతి, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్లోని పెట్రోల్ బంకుల్లో యూపీఐ చెల్లింపులను నిలిపివేసి నగదు చెల్లింపులను మాత్రమే స్వీకరించే అంశంపై ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
యూపీఐ చెల్లింపుల విషయంలో వినియోగదారులతో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలపై పోలీసు శాఖ ఉన్నతాధికారులకు వివరించేందుకు అసోసియేషన్ ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో డీజీపీని కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
యూపీఐ పేమెంట్లకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను ఇప్పటికే కేంద్ర మంత్రికి లేఖ ద్వారా వివరించినట్లు ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ తెలిపింది.
పెట్రోల్ బంకుల్లో నగదు చెల్లింపుల విధానం అమలు చేసే అంశంపై అసోసియేషన్ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.










Leave a Reply