నిందితుడి అరెస్ట్.. 68 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం
పెదకాకాని, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఒక నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి 68 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆలయంలో బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఘటనపై Cr.No.448/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా చోరీకి పాల్పడిన నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో 50 గ్రాముల నాగాభరణం, రెండు బంగారు మంగళసూత్రాలు, ఒక బంగారు గుత్తి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
చోరీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్న అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు తెలిపారు. కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్










Leave a Reply