Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › 2021–2026 బ్యాచ్‌ల LL.B. బ్యాక్‌లాగ్ విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలి
బ్రేకింగ్ న్యూస్

2021–2026 బ్యాచ్‌ల LL.B. బ్యాక్‌లాగ్ విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలి

02:58 తెల్లవారుజాము AM

విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయం చర్యలు తీసుకోవాలి: చేరాల వంశీ

హైదరాబాద్ | అయుష్ 24 న్యూస్

2021 నుంచి 2026 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో LL.B. విద్యను పూర్తి చేసినప్పటికీ కొన్ని బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు మిగిలిపోయిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యేక బ్యాక్‌లాగ్ పరీక్షలు నిర్వహించాలని జాతీయ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. సుధాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయం జారీ చేసిన లేఖ నం. 166/LLB/Exam/2022 ద్వారా 1991 నుంచి 2020 వరకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు బ్యాక్‌లాగ్ పరీక్షలు రాసి పెండింగ్ సబ్జెక్టులను పూర్తి చేసుకునే అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

అదే విధంగా 2021–2026 మధ్య LL.B. పూర్తి చేసిన విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా బ్యాక్‌లాగ్ పరీక్షలు నిర్వహించి, పెండింగ్ సబ్జెక్టులను పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.

బ్యాక్‌లాగ్ సబ్జెక్టుల కారణంగా అనేక మంది విద్యార్థులు తమ LL.B. డిగ్రీని పూర్తిగా పొందలేకపోతున్నారని, దీంతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, తదుపరి విద్యా అవకాశాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని వంశీ తెలిపారు.

ఒక్క బ్యాక్‌లాగ్ సబ్జెక్టు కారణంగా విద్యార్థుల విలువైన విద్యా సంవత్సరం నష్టపోకుండా విశ్వవిద్యాలయం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెగ్యులర్ పరీక్షలకు అదనంగా వీలైనంత త్వరగా ప్రత్యేక బ్యాక్‌లాగ్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు తమ పెండింగ్ సబ్జెక్టులను పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ఈ సమస్యను సానుకూలంగా పరిశీలించి, 2021–2026 LL.B. బ్యాక్‌లాగ్ విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని కాపాడాలని చేరాల వంశీ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు సనాల వెంకటాద్రి చారీ, పరశురాం, భాషా తదితరులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 1🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *