బన్సీలాల్‌పేట్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ బన్సీలాల్‌పేట్ డివిజన్ నాయకులు విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు బన్సీలాల్‌పేట్ డివిజన్లోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం, ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలకు పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో కుర్మ హేమలత, లక్ష్మిపతి, ప్రేమ్ కుమార్, దేశపాక శ్రీనివాస్, నాగభూషణం, అబ్బాస్, రమేష్, అచ్చా, ఫయీమ్, బాయ్, అరుణ్, విజయ్ శంకర్, కుమార్ యాదవ్, సాయి, వెంకట్ బాబు, శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ గౌడ్, అనిల్, సురేష్, శివ, అజయ్, విజయ్ పాల్, లక్ష్మినారాయణ, రాజు, ఏసూరి శ్రీను, సీమ తదితరులు పాల్గొన్నారు.



Mahamood Mohammed





Leave a Reply