1వ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో స్పీడ్ పంచింగ్, స్పీడ్ కికింగ్‌లో సత్తా

హైదరాబాద్, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్:
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 1వ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్లో కేవలం 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారి స్మరణి రాజ్ అద్భుత ప్రతిభ కనబరిచి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

రికార్డు ఈవెంట్‌లో స్మరణి రాజ్ 1 నిమిషంలో 200 స్పీడ్ పంచ్‌లు, 1 నిమిషంలో 100 స్పీడ్ కిక్‌లు విజయవంతంగా చేసి అసాధారణ ప్రతిభను ప్రదర్శించింది. ఈ ఘనతకు గుర్తింపుగా ఆమెకు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు, గోల్డ్ మెడల్ అందజేశారు.
ఈ సందర్భంగా హై రేంజ్ వరల్డ్ రికార్డ్స్ తెలంగాణ హెడ్ సుమన్, అమికల్ స్పోర్ట్స్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ వీణా వాహిని, జేఆర్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి చిన్నారి స్మరణి రాజ్‌ను ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు.
ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో జాంబియా, ఇథియోపియా, మారిషస్, జపాన్, శ్రీలంక, నేపాల్, దక్షిణాఫ్రికా తదితర దేశాలతో కలిపి మొత్తం 12 దేశాల నుంచి, అలాగే భారతదేశంలోని 22 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.
కేవలం ఐదేళ్ల వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించిన స్మరణి రాజ్‌ను పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
స్మరణి రాజ్‌కు అయుష్ 24 న్యూస్ తరఫున హృదయపూర్వక అభినందనలు. 🥋🏆🇮🇳
జై హింద్! 🇮🇳










Leave a Reply