ముఖ్య అతిథిగా హాజరు కావాలని డాక్టర్ మోహన్ నాయక్‌కు ఆహ్వానం
రామాయంపేట, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామంలో శ్రీశ్రీ వాల్మీకి దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
మహోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 7న వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ హాజరు కావాలని కోరుతూ నిర్వాహకులు ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎల్లం, ఏస్వామి, శ్రీను, యాదగిరి, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply