Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › హన్షి డా. జి. సాయి యాదవ్‌కు గ్లోబల్ మార్షల్ ఆర్ట్స్ ఛత్రపతి అవార్డు
బ్రేకింగ్ న్యూస్

హన్షి డా. జి. సాయి యాదవ్‌కు గ్లోబల్ మార్షల్ ఆర్ట్స్ ఛత్రపతి అవార్డు

05:02 సాయంత్రం PM

మార్షల్ ఆర్ట్స్ రంగంలో విశిష్ట సేవలకు గౌరవం

గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026లో ఘన సత్కారం

హైదరాబాద్, సెప్టెంబర్ 5: మార్షల్ ఆర్ట్స్ రంగంలో విశిష్ట సేవలు, కృషి, అంకితభావాన్ని గుర్తిస్తూ హన్షి డా. జి. సాయి యాదవ్కు ప్రతిష్టాత్మక గ్లోబల్ మార్షల్ ఆర్ట్స్ ఛత్రపతి అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని తెలంగాణ సరస్వతీ పరిషత్, తిలక్ రోడ్‌లో నిర్వహించిన గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో ఆయనకు ఈ గౌరవాన్ని అందజేశారు.

బ్రూస్ లీ డ్రాగన్ సాయి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌గా, అలాగే మూవీ ఫైట్ మాస్టర్‌గా హన్షి డా. జి. సాయి యాదవ్ అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేసినట్లు అవార్డు సర్టిఫికేట్‌లో పేర్కొన్నారు.

మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో అందిస్తున్న సేవలను నిర్వాహకులు ప్రశంసించారు. మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన చూపుతున్న అంకితభావం, పట్టుదల, సేవలను అభినందిస్తూ ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందించినట్లు సర్టిఫికేట్‌లో పేర్కొన్నారు.

ఈ అవార్డు కార్యక్రమాన్ని Amateur Sports & Culture Awards Association ఆధ్వర్యంలో నిర్వహించారు. సంస్థ వివరాల ప్రకారం Global Excellence Icon Awards–2026లో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తులను సత్కరించారు.

కార్యక్రమంలో Hanshi C. Amar Singh, Founder & Director, Amateur Sports & Culture Awards Association, కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు.

మార్షల్ ఆర్ట్స్ రంగంలో తన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించడం పట్ల హన్షి డా. జి. సాయి యాదవ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 21🔗 Shares: 3👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
22 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *