తెలంగాణ SBI హైదరాబాద్ సర్కిల్ నుంచి అధ్యక్షులు NVT, ప్రధాన కార్యదర్శి రాజు కొమీరీ శెట్టి హాజరు
అహ్మదాబాద్:
SBI OBC నేషనల్ ఫెడరేషన్ (NAFSOE) తొలి సమావేశం అహ్మదాబాద్‌లో విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫెడరేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఫెడరేషన్‌ను మరింత బలోపేతం చేయడం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
ఈ తొలి సమావేశంలో తెలంగాణ SBI హైదరాబాద్ సర్కిల్ నుంచి అధ్యక్షులు NVT, ప్రధాన కార్యదర్శి రాజు కొమీరీ శెట్టి పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ప్రతినిధులు సమావేశానికి హాజరు కావడం పట్ల సభ్యులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.
SBI OBC ఉద్యోగుల సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేస్తూ, భవిష్యత్తులో ఫెడరేషన్‌ను మరింత బలోపేతం చేయాలని సమావేశంలో ఆకాంక్షించారు.
సమాఖ్య తొలి సమావేశం విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా ఫెడరేషన్ నాయకులు, సభ్యులు, ప్రతినిధులకు పలువురు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

అయుష్ 24 న్యూస్ ప్రతినిధి










Leave a Reply