Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు
Home › బ్రేకింగ్ న్యూస్ › ఆర్టీఐ సమాచార బోర్డు ఏర్పాటు చేయరా?
బ్రేకింగ్ న్యూస్

ఆర్టీఐ సమాచార బోర్డు ఏర్పాటు చేయరా?

10:50 ఉదయం AM

ఎంఈఓ నాగేశ్వరరావు నిర్లక్ష్యంపై RTISS ఆగ్రహం

కొండమల్లేపల్లి, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం అమలు కావాల్సి ఉండగా, నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల విద్యా వనరుల కేంద్రం (MRC–సమగ్ర శిక్ష) కార్యాలయంలో ఆర్టీఐ సమాచార బోర్డు ఏర్పాటు చేయలేదని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (RTISS) ఆరోపించింది.

RTISS వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు కె. బాబురాం నాయక్ ఈ విషయంపై స్పందిస్తూ.. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(b) ప్రకారం ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. కార్యాలయం వద్ద పౌర సమాచార అధికారి (PIO), అప్పీలేట్ అధికారి పేర్లు, హోదాలు, సంప్రదింపు వివరాలతో కూడిన సమాచార బోర్డు ఏర్పాటు చేయాలని స్థానిక ఎంఈఓ నాగేశ్వరరావును ఇప్పటికే నాలుగుసార్లు కోరినట్లు ఆయన తెలిపారు.

అయినప్పటికీ ఇప్పటివరకు బోర్డు ఏర్పాటు చేయలేదని బాబురాం నాయక్ ఆరోపించారు. సమాచార బోర్డు లేకపోవడం వల్ల మండల పరిధిలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు సమాచార హక్కు చట్టం కింద ఎవరిని సంప్రదించాలో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి

సమాచార బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు RTISS నాయకులు తెలిపారు.

అదేవిధంగా రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించి, సంబంధిత అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు బాబురాం నాయక్ వెల్లడించారు.

ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు కార్యాలయాల్లో అవసరమైన సమాచారాన్ని బహిరంగంగా అందుబాటులో ఉంచాలని, కొండమల్లేపల్లి MRC కార్యాలయం వద్ద ఆర్టీఐ సమాచార బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని RTISS డిమాండ్ చేసింది.

ఈ కార్యక్రమంలో RTISS నాయకులు ఎండి సిరాజ్ పాల్గొన్నారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 12🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
72 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App