మట్టిలో మాణిక్యం.. దేవరకొండ మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేతావత్ నగేష్‌కు సత్కారం
దేవరకొండ, సెప్టెంబర్ 20 (ప్రతినిధి): మిషన్ భగీరథ విభాగంలో ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ దేవరకొండ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేతావత్ నగేష్‌కు గ్లోబల్ ఎక్సలెంట్ ఐకాన్ 2026 అమేచర్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వీస్ ఓరియెంటెడ్ ఆఫీసర్ నంది అవార్డు అందజేశారు.
ఆదివారం హైదరాబాద్‌లోని కాటేదాన్ స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు షియాన్స్ అమర్ సింగ్, షియాన్స్ కేశవ్ గౌడ్, చైతన్య మాస్టర్ తదితరులు కేతావత్ నగేష్‌ను శాలువాతో సత్కరించి, నంది అవార్డు, జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేతావత్ నగేష్ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ మిషన్ భగీరథలో ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్నారని తెలిపారు. దేవరకొండ డివిజన్ పరిధిలో ప్రజలకు తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చి ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం సాధించినప్పటికీ, ప్రజలకు సేవ చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. తండాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
మిషన్ భగీరథ రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల ప్రశంసలతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అభినందనలు లభిస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఆయన సేవలను గుర్తిస్తూ తమ సంస్థ తరఫున సర్వీస్ ఓరియెంటెడ్ ఆఫీసర్ నంది అవార్డుతో సత్కరించినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో షియాన్స్ అమర్ సింగ్, షియాన్స్ కేశవ్ గౌడ్, చైతన్య మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth










Leave a Reply