తెల్కపల్లి: విద్యార్థులకు విద్యాబుద్ధులు అందిస్తూ సుమారు 41 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో సేవలందించిన శ్రీమతి మంద వెంకటరెడ్డి కౌసల్యమ్మ పదవీ విరమణ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు ఘనంగా సన్మానించారు.
కౌసల్యమ్మ గారు 16-09-1965న జన్మించారు. చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి పెంచుకుని ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. 1981 ఫిబ్రవరి 14న చింతపల్లి గ్రామ మానవతీ? పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలను ప్రారంభించారు. అనంతరం వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారు.
1985 డిసెంబర్ 17న ఎం.యు.పి.ఎస్. లక్ష్మాపూర్ యందు మొదటి నియామకం పొందిన ఆమె, అనంతరం పి.ఎస్., తెల్కపల్లి, మహదేవపూర్ తదితర పాఠశాలల్లో సేవలందించారు. 2006లో ఎస్.ఏ.గా పదోన్నతి పొంది, కోడలికుంట, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో కూడా విధులు నిర్వహించారు. విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేశారు.
ఉపాధ్యాయురాలిగా తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. విద్యార్థుల పట్ల ప్రేమాభిమానాలతో మెలుగుతూ, వారి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేశారు. సహచర ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా ఉంటూ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేశారు.
సుమారు 41 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలో ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన కౌసల్యమ్మ సేవలను పలువురు కొనియాడారు. ఆమె పదవీ విరమణ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు శ్రేయోభిలాషులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
పదవీ విరమణ అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఘనంగా సత్కరించారు










Leave a Reply