మంథని, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
TNGOs, TGEJSC పిలుపు మేరకు మంథని పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగులు బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు తమ డిమాండ్లకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగుల పెన్షన్ భద్రత కోసం OPSను పునరుద్ధరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో TNGOs మంథని డివిజన్ అధ్యక్షుడు నూకల శంకర్, తహసీల్దార్ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ బి. కిరణ్ కుమార్‌తో పాటు సీనియర్ అసిస్టెంట్లు, మండల సర్వేయర్లు, GPOలు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు తదితర ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.









Leave a Reply