వర్షితను సన్మానించి అభినందించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి
పరిగి, సెప్టెంబర్ 22 (ప్రతినిధి):
కుల్కచర్ల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య గౌడ్ కుమార్తె వర్షిత MBBS సీటు సాధించిన సందర్భంగా పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా వర్షితకు ఎమ్మెల్యే రూ.50,000 నగదు బహుమతిని అందజేశారు. ఉన్నత విద్యాభ్యాసాన్ని విజయవంతంగా కొనసాగించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యారంగంలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు తగిన సహకారం అందిస్తామని తెలిపారు.
వర్షిత MBBS సీటు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.










Leave a Reply