విద్యార్థులతో సమస్యలు, విద్యాభ్యాసంపై ఆరా.. వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం
టేకులపల్లి, ఆగస్టు 22, అయుష్ 24 న్యూస్: ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ కోరం కనకయ్య టేకులపల్లి మండలం గోలియాతండ గ్రామపంచాయతీ పరిధిలోని PMH బాలుర హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థులు ఉంటున్న వసతి గృహంతో పాటు హాస్టల్ ప్రాంగణం మొత్తాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వసతి గృహంలో ఎదుర్కొంటున్న సమస్యలు, అందుతున్న సౌకర్యాలు, వారు అభ్యసిస్తున్న విద్య తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. విద్యార్థుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అయితే హాస్టల్ తనిఖీ సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల వసతి, భద్రత, సంక్షేమం విషయంలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు టేకులపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కె. తిరుపతి, ఇల్లందు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, కాంగ్రెస్ నాయకులు మూడ్ శ్రీను, జాటోత్ రవీందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply