నాగారం, మల్లెపల్లి, కన్నాల గ్రామాల్లో గ్రామ సభలు
నాగారం, ఆగస్టు 28, అయుష్ 24 న్యూస్: SIR ఫేజ్–2 ప్రక్రియలో భాగంగా నాగారం, మల్లెపల్లి, కన్నాల గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రజలకు ఓటరు జాబితాపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితాలో తమ పేర్లు, ఇతర వివరాలను ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని నాయకులు సూచించారు. జాబితాలో ఏవైనా తప్పులు, వివరాల్లో మార్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి సరిచేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, కిసాన్ సెల్ అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి, బూడిద శంకర్, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు ఐలి శ్రీనివాస్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే గ్రామ సర్పంచులు లక్కకుల సత్యనారాయణ, బెల్లంకొండ శ్రీదేవి–సత్యనారాయణ, గుడిసె గట్టయ్య, ఉప సర్పంచులు, సీనియర్ నాయకులు ఎరుకల మధు, పొయ్యిల రాజయ్య, కావాటి సందీప్, వెంకట్ స్వామి, జైపాల్, శ్రావణ్, పాషా తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply