అయుష్ 24 న్యూస్ | దేవరకొండ
దేవరకొండ నియోజకవర్గం – దేవరకొండ టౌన్
దేవరకొండ పట్టణానికి చెందిన మహమ్మద్ అతిక్ గారి కుమారుడు UPSC పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అవసరమైన పాఠ్యపుస్తకాలను బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్ అందజేశారు.
దేవరకొండలోని తన నివాసంలో ఈ పాఠ్యపుస్తకాలను విద్యార్థికి అందించిన వడ్త్య రమేష్.. UPSC పోటీ పరీక్షల్లో విద్యార్థి మంచి ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం అవసరమైన పుస్తకాలు, మార్గదర్శక సహకారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.



Mahamood Mohammed






Leave a Reply