మంథని, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): మంథని జెడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాలలో ప్రముఖ అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్ సింగారపు శివరామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు త్రీడీ ఆర్ట్‌పై ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శివరామకృష్ణ త్రీడీ ఆర్ట్ చిత్రాలను ప్రత్యక్షంగా గీస్తూ, వాటి మెలకువలు మరియు దృశ్య భ్రమకు సంబంధించిన అంశాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా కార్యక్రమంలో పాల్గొని త్రీడీ ఆర్ట్‌కు సంబంధించిన పలు అంశాలను నేర్చుకున్నారు. పలువురు విద్యార్థులు తాము గీసిన చిత్రాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ సార్, రవీందర్ సార్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొన్నారు.

త్రీడీ ఆర్ట్‌ను విద్యార్థులకు పరిచయం చేయడం, వారితో కలిసి చిత్రాలను రూపొందించడం ఎంతో ఆనందంగా ఉందని త్రీడీ ఆర్టిస్ట్ సింగారపు శివరామకృష్ణ తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.
AYUSH 24 NEWS
The Voice of Truth










Leave a Reply