గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెండు, మూడు రోజుల్లో ప్రక్రియ ప్రారంభం
అమరావతి, సెప్టెంబర్ 6, అయుష్ 24 న్యూస్:
ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెండు, మూడు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు అన్ని కేటగిరీలకు సంబంధించిన పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.
పింఛన్లకు సంబంధించి ఏయే కేటగిరీలకు దరఖాస్తులు స్వీకరించాలి, వాటిని ఏ విధంగా పరిశీలించాలనే అంశాలపై గురువారం రాత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ అధికారులు చర్చించినట్లు సమాచారం. అనంతరం సంబంధిత అంశాలను అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించారు.
ఈ అంశాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, ఆయన ఆమోదం అనంతరం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
దశలవారీగా పింఛన్ల పంపిణీపై పరిశీలన
కొత్త పింఛన్ల కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్యను బట్టి లబ్ధిదారులకు పింఛన్లు ఒకేసారి మంజూరు చేయాలా? లేక దశలవారీగా మంజూరు చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన విధివిధానాలు, అర్హతలు, ప్రక్రియపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.









Leave a Reply