Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › ట్రాన్స్‌జెండర్లకు నల్లగొండ డీఎస్పీ సూచనలు
బ్రేకింగ్ న్యూస్

ట్రాన్స్‌జెండర్లకు నల్లగొండ డీఎస్పీ సూచనలు

05:31 సాయంత్రం PM

బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: డీఎస్పీ శివరాం రెడ్డి

నల్లగొండ: ట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలని నల్లగొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి సూచించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నల్లగొండలో నిర్వహించిన అవగాహన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఇళ్ల వద్ద బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం, డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం, బెదిరించడం లేదా అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

ట్రాఫిక్ సిగ్నల్స్, పండుగలు, శుభకార్యాల సందర్భాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. ప్రజలను వేధించడం లేదా బలవంతపు వసూళ్లకు పాల్పడటం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

అదే సమయంలో ట్రాన్స్‌జెండర్లు కూడా సమాజంలో ఒక భాగమేనని, వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీఎస్పీ పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ప్రజల హక్కులు, స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా వ్యవహరించాలని డీఎస్పీ శివరాం రెడ్డి కోరారు.

ఈ అవగాహన సమావేశంలో సీఐలు ఆదిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐలు సైదాబాబు, షరీఫ్‌తో పాటు పట్టణానికి చెందిన పలువురు ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 8🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *