తిరుమల, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ప్రత్యేక మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
మోహినీ రూపంలో అలంకరించిన శ్రీ మలయప్పస్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జగన్మోహనాకారంలో స్వామివారు భక్తులను కటాక్షించడంతో తిరుమల ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో నిండిపోయాయి.

భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అధికారులు, సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
AYUSH 24 NEWS
The Voice of Truth










Leave a Reply