హైదరాబాద్, సెప్టెంబర్ 19 (ప్రతినిధి):
దేవరకొండకు చెందిన యువ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారుడు, AYUSH Karate Academy of India బ్లాక్ బెల్ట్ క్రీడాకారుడు పున్న శ్రీజన్ ప్రతిష్ఠాత్మక Global Excellence Icon Awards–2026లో Global Bruce Lee Award–2026 అందుకోనున్నారు.
సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్న ఈ అవార్డు కార్యక్రమాన్ని Amateur Sports & Culture Awards Association International ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పోస్టర్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి Shihan Keshav Goud ఆర్గనైజింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ, క్రమశిక్షణ, నిరంతర సాధనకు గుర్తింపుగా పున్న శ్రీజన్ కు ఈ అవార్డు లభించడం పట్ల AYUSH Karate Academy of India కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్‌లో సాధన కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందడం పట్ల కుటుంబ సభ్యులు, శిక్షకులు, సహచర క్రీడాకారులు పున్నా శ్రిజన్అభినందనలు తెలిపారు.
“కష్టపడి సాధన చేస్తే విజయానికి మార్గం సుగమమవుతుంది” అనే సందేశంతో యువతకు స్ఫూర్తిగా నిలవాలని వారు ఆకాంక్షించారు.
AYUSH24 NEWS
The Voice of Truth










Leave a Reply