రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం కేసులో హాజరు
ఇల్లందు, సెప్టెంబర్ 7 – అయుష్ 24 న్యూస్ ప్రతినిధి:
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి సంబంధించి ఇల్లందు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో బీఆర్ఎస్ నేతలు సోమవారం ఇల్లందు కోర్టుకు హాజరయ్యారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ బానోత్ హరిప్రియ నాయక్, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు కోర్టుకు హాజరయ్యారు.
బీఆర్ఎస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, 2025 సెప్టెంబర్ 7న నిర్వహించిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి సంబంధించి ఇల్లందు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 306/25గా కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా సోమవారం కోర్టుకు హాజరైనట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా హరిప్రియ నాయక్, దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ.. అరెస్టులు, అణచివేతలతో బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకోలేరని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేసేది బీఆర్ఎస్ పార్టీనే అని వారు అన్నారు.
కోర్టుకు హాజరైన వారిలో..
మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్‌తో పాటు సిలివేరి సత్యనారాయణ, శీలం రమేష్, జేకే శ్రీను, దేవిలాల్ నాయక్, దాస్యం ప్రమోద్ కుమార్, ఎలమందల వాసు, లాల్ సింగ్, డేరంగుల పోశం, అజ్మీర బావ్ సింగ్, సనా రాజేష్, రామ్ లాల్ పాసి, పరుచూరి వెంకటేశ్వర్లు, నెమలి ధనలక్ష్మి, ఎస్.కె. సర్దార్, ఎం.డి. అబ్దుల్ జబ్బార్, ఎస్.కె. అబ్దుల్లా తదితరులు కోర్టుకు హాజరైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అయుష్ 24 న్యూస్









Leave a Reply