జాతీయ జెండా దేశభక్తికి, జాతీయ ఐక్యతకు ప్రతీక: సయ్యద్ అజీముద్దీన్
అయుష్ 24 న్యూస్ | ఆగస్టు 15
ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈద్గా కాంప్లెక్స్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షులు సయ్యద్ అజీముద్దీన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ జెండా దేశభక్తికి, జాతీయ ఐక్యతకు ప్రతీక అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛా భారతదేశం లభించిందని అన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఐక్యత, సమానత్వం, సోదరభావంతో సమాజం ముందుకు సాగాలని, దేశ సమగ్ర అభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువత విద్య, ఉపాధి, సాంకేతికతతో పాటు సామాజిక సేవా రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.
విభిన్న మతాలు, వర్గాలు, జాతులతో కూడిన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ దేశ రక్షణ, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు ఎండి షబ్బీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి ఇలియాస్ పటేల్, మాజీ వైస్ చైర్మన్ ఎండి రహత్ అలీ, సయ్యద్ మాజీద్ మౌలానా, ఎండి ఖదీర్ (సాలార్), ఎండి సలీం, సయ్యద్ దస్తగీర్, ఎస్‌కే ఇలియాస్ బాబా, కౌన్సిలర్ ఎస్‌కే నవీద్, ఎండి షబ్బీర్, ఎండి ముజీబ్, సయ్యద్ న్యామత్ షా, ఎండి షకిల్, ఎండి హమీద్, డాక్టర్ జహంగీర్, ఎండి సులేమాన్, గయాసోద్దీన్, అలీ మొద్దీన్, ఎండి షరీఫ్, ఎండి అజ్మత్, మోయిన్ పాషా, ఎండి జాకీర్, ఎండి మంజూర్, ఇక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply