కొండమల్లెపల్లిలో రేపు వంటావార్పు కార్యక్రమం
కాంగ్రెస్ 1000 రోజుల పాలనకు నిరసనగా పోరుబాట
మహిళలు, వికలాంగులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలి: మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
కొండమల్లెపల్లి, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 4న కొండమల్లెపల్లి పట్టణంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించనున్నట్లు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు.
గురువారం కొండమల్లెపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న వంటావార్పు కార్యక్రమ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా, ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రమావత్ రవీంద్రకుమార్ పేర్కొన్నారు.
ఉదయం 10 గంటలకు వంటావార్పు
సెప్టెంబర్ 4, 2026 శుక్రవారం ఉదయం 10 గంటలకు కొండమల్లెపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వంటావార్పు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
దేవరకొండ నియోజకవర్గంలోని మహిళలు, వికలాంగులు, మాజీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్



Mahamood Mohammed






నేను దాదాపు 35 సంవత్సరాలుగా వైద్యరంగంలో 104 ల్యాబ్ టెక్నీషియన్ గాను మరియు మెడికల్ ప్రాక్టీషనర్ గా సేవలందిస్తున్నాను, దీనికి తోడు టీబి సెంటర్ దేవరకొండ నందు పని చేశాను, టీబి సోకిన వారి పట్ల తన కర్తవ్యం పట్ల వారికి అవగాహన కల్పిస్తూ ఈ వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందకుండా సలహాలు ఇస్తూ బలమైన ఆహారం మంచి అలవాట్ల నయమవుతుందని వారికి భరోసా ఇవ్వడం , స్వచ్ఛంద కార్యక్రమాలతో మద్యం డ్రగ్స్ మత్తుమందు అలవాటు పడ్డ యువకులను స్వచ్ఛంద సంస్థల వారికి సమాచారం అందించడమే కాకుండా వాళ్లను చైతన్య పరుస్తున్నాను ప్రస్తుతం నేను ఇక్కడే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ గా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాను, నాకున్న ఎప్పుడు నుంచి ఆలోచన దేవరకొండ పరిసర ప్రాంతం అత్యధిక గిరిజన ప్రాంతం ఇక్కడ నవ యువకులు మద్యం గంజాయి డ్రక్స్ గా అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, వారి కొరకు ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఒక డ్రగ్స్ నిర్మూలన స్వచ్ఛంద సంస్థ వస్తే బాగుండే అని అభిప్రాయం, దానిద్వారా ఈ వ్యసనాలను అలవాటుపడ్డ వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వారిని చైతన్య పరచాలని ప్రగాఢమైన కోరిక