సంఘ సంస్కర్త, హైదరాబాద్ మాజీ మేయర్ సేవలను స్మరించుకున్న పరిగి ఎమ్మెల్యే
పరిగి, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకులు, సంఘ సంస్కర్త, పత్రికా సంపాదకులు, హైదరాబాద్ మాజీ మేయర్ దివంగత కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా పరిగి పట్టణంలోని ఆయన విగ్రహానికి పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ముదిరాజ్ సమాజ అభ్యున్నతితో పాటు సామాజిక చైతన్యం, విద్యా అభివృద్ధి కోసం చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజ సేవలో ఆయన అందించిన సేవలను నేటి తరానికి ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
కృష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.









Leave a Reply