జోనల్ స్థాయి క్రికెట్, వాలీబాల్ విజేతలకు బహుమతుల ప్రదానం
పరిగి:
పరిగి పట్టణంలోని నంబర్ వన్ స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన జోనల్ స్థాయి క్రికెట్, వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకులు, టీపీసీసీ మెంబర్ డాక్టర్ టి. రితిక్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి విజేత జట్లకు షీల్డులు, బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ టి. రితిక్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, టీమ్ స్పిరిట్ పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయని అన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
విజేత జట్ల క్రీడాకారులకు షీల్డులు, బహుమతులు అందజేసి అభినందించారు. క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
— అయుష్ 24 న్యూస్









Leave a Reply