హైదరాబాద్, సెప్టెంబర్ 5 (అయుష్ 24 న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి నియమితులైన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గద్వాల్ విజయలక్ష్మిని శాలువాతో సత్కరించి, మొక్కను అందజేశారు. ఆమెకు అభినందనలు తెలియజేస్తూ, నూతన బాధ్యతల్లో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకుడు కె.ఎస్. ఆనంద్ రావు, కె. గోవింద్ రాజ్, బి. వీర రెడ్డి, ఎ. కోటి రెడ్డి, ఎన్. శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply