తంజావూరు, తమిళనాడు: తమిళనాడులోని తంజావూరు జిల్లా పాపనాశంలో 29, 30 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన నేషనల్ రిఫరీ & తైక్వాండో నేషనల్ సెమినార్ విజయవంతంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక సెమినార్‌కు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 55 మందికి పైగా తైక్వాండో మాస్టర్లు హాజరై శిక్షణ పొందారు.
మాస్టర్ ఎస్. ఉపేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ–హైదరాబాద్ నుంచి మొత్తం ఆరుగురు తైక్వాండో మాస్టర్లు ఈ నేషనల్ సెమినార్లో పాల్గొన్నారు. వారిలో నారాయణ రొకాయా, గణేష్ శర్మ, మాస్టర్ ఎస్. ఉపేందర్, పి. రఘు, పి. సాయి మహేష్ మరియు రజు రాథోడ్ ఉన్నారు.
ఈ రెండు రోజుల సెమినార్లో తైక్వాండో పోటీ నియమ నిబంధనలు, రిఫరీ విధులు, సాంకేతిక అంశాలు, పోటీల నిర్వహణ విధానం మరియు అంతర్జాతీయ స్థాయి రూల్స్‌పై మాస్టర్లకు ప్రత్యేక అవగాహన కల్పించారు.
సెమినార్‌కు ముఖ్య శిక్షకులు మరియు పరీక్షకులుగా కుక్కివాన్ గ్రాండ్ మాస్టర్, ఇంటర్నేషనల్ క్లాస్–2 సర్టిఫైడ్ ఎగ్జామినర్ మరియు కుక్కివాన్ 6వ డాన్ మాస్టర్ M. John De Britto పాల్గొని మాస్టర్లకు విలువైన మార్గదర్శకత్వం అందించారు.
సెమినార్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణకు చెందిన ఆరుగురు మాస్టర్లను మాస్టర్ M. John De Britto సర్టిఫికెట్లతో అభినందించారు. ఈ సర్టిఫికేషన్ తైక్వాండో రంగంలో వారి సాంకేతిక పరిజ్ఞానం, రిఫరీ నైపుణ్యాలు మరియు అంతర్జాతీయ ప్రమాణాలపై అవగాహనను మరింత పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ నుంచి ఆరుగురు మాస్టర్లు ఒకే బృందంగా ఈ జాతీయ స్థాయి సెమినార్లో పాల్గొనడం పట్ల తైక్వాండో వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో తెలంగాణ నుంచి మరింత మంది మాస్టర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెమినార్లు మరియు పోటీల్లో పాల్గొని తైక్వాండో రంగానికి మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.










Leave a Reply