జెండా ఆవిష్కరణతో పాటు రక్తదాన కార్యక్రమం
దేవరకొండ, ఆగస్టు 30: దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల గేటు ప్రాంగణం వద్ద 2018 ఆగస్టు 30న ఏర్పాటు చేసిన శివాజీ యువదళం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 8వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణతో పాటు రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ–వెంకటేశ్వర్లు జెండాను ఆవిష్కరించి రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పలువురు యువత రక్తదానం చేసి సామాజిక సేవలో భాగస్వాములయ్యారు. యువతలో సేవా భావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు హన్మంతు సాయి చంద్ర గౌడ్, గుండాల అంజయ్య, పులిజాల ఝాన్సీ, కేతావత్ అజయ్ చంద్ర, పొట్ట మధు తదితరులు పాల్గొన్నారు.
అలాగే శివాజీ యువదళ అధ్యక్షులు పగిడిమర్రి సతీష్, గౌరవ అధ్యక్షులు నెతాళ్ల వెంకటేష్, గడ్డం శివ, వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు, యువదళ సభ్యులు, పలువురు యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అయుష్ 24 న్యూస్
The Voice of Truth



Mahamood Mohammed






Leave a Reply