Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేత
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేత

09:09 ఉదయం AM

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్

దేవరకొండ, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీఓ సాగర్ శనివారం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం మన జన్మహక్కు అని, 1947 ఆగస్టు 15 భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజని అన్నారు. విదేశీ పాలన నుంచి దేశానికి విముక్తి లభించిన ఈ రోజును ప్రతి భారతీయుడు గర్వంగా జరుపుకోవాలని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజాపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, కిన్నెర హరికృష్ణ, సిరందాసు కృష్ణయ్య, డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, జాన్ యాదవ్, దేవేందర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

🇮🇳 జై హింద్ | వందే మాతరం 🇮🇳

AYUSH 24 NEWS

THE VOICE OF TRUTH

#Ayush24News #Devarakonda #IndependenceDay2026 #BaluNaik #TelanganaNews #JaiHind

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 4🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *