నల్గొండ | నవంబర్ 07, 2026 | Ayush 24 News
నిరుపేదలకు CMRF పథకం ద్వారా ఆర్థిక భరోసా: గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ: వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 60 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) పథకం ద్వారా మంజూరైన రూ.33,55,500 విలువైన చెక్కులను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు.
శనివారం నల్గొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా నిరుపేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం సంతోషంగా ఉందన్నారు.
నిరుపేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
Ayush 24 News
నిజాలే మా వార్తలు.. ప్రజలే మా లక్ష్యం.
నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ.. 60 మందికి రూ.33.55 లక్షల చెక్కుల పంపిణీ
నల్గొండ | నవంబర్ 07, 2026 | Ayush 24 News నిరుపేదలకు CMRF పథకం ద్వారా ఆర్థిక భరోసా: గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ: వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 60 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) పథకం ద్వారా


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply