ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్
జహీరాబాద్, సెప్టెంబర్ 5, అయుష్ 24 న్యూస్:
పేదల సంక్షేమం, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ డా. ఏ. చంద్రశేఖర్ అన్నారు.
మొగుడంపల్లి మండలంలోని విట్టునాయక్ తండాలో ఈశ్వర్ కుటుంబానికి నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని, జహీరాబాద్ మండలంలోని హోతి (బి) గ్రామంలో ఉప్పరి నర్సింలు కుటుంబానికి నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని డా. ఏ. చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల అధ్యక్షులు పవన్ రాథోడ్, హుగ్గేల్లి రాములు, మాజీ మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్, మాజీ పట్టణ అధ్యక్షులు కండేం నర్సింలు, సర్పంచులు ప్రేమ్ రాథోడ్, రాజ్ కుమార్, విష్ణు, ఏఎంసీ డైరెక్టర్లు శేఖర్, వంశీ రాజ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply