Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ
Home › బ్రేకింగ్ న్యూస్ › ప్రజాభవన్‌లో ఘనంగా పైడాకుల అశోక్ జన్మదిన వేడుకలు
బ్రేకింగ్ న్యూస్

ప్రజాభవన్‌లో ఘనంగా పైడాకుల అశోక్ జన్మదిన వేడుకలు

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ జన్మదినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ సీతక్క అశోక్‌తో కలిసి కేక్ కట్ చేసి, ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి

09:28 ఉదయం AM

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ జన్మదినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ సీతక్క అశోక్‌తో కలిసి కేక్ కట్ చేసి, ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పైడాకుల అశోక్ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, ములుగు జిల్లాలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారని అభినందించారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
కష్టకాలంలోనూ పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తూ, ఎన్నికల సమయంలో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ విజయానికి కృషి చేయడం అశోక్ ప్రత్యేకత అని సీతక్క పేర్కొన్నారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
పైడాకుల అశోక్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజలకు, పార్టీకి మరింత సేవ చేయాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అశోక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
— Ayush 24 News
The Voice of Truth Media

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 6🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
262 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App