హైదరాబాద్, సెప్టెంబర్ 19: ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ జన్మదినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ సీతక్క అశోక్‌తో కలిసి కేక్ కట్ చేసి, ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పైడాకుల అశోక్ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, ములుగు జిల్లాలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారని అభినందించారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
కష్టకాలంలోనూ పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తూ, ఎన్నికల సమయంలో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ విజయానికి కృషి చేయడం అశోక్ ప్రత్యేకత అని సీతక్క పేర్కొన్నారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
పైడాకుల అశోక్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజలకు, పార్టీకి మరింత సేవ చేయాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అశోక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
— Ayush 24 News
The Voice of Truth Media
ప్రజాభవన్‌లో ఘనంగా పైడాకుల అశోక్ జన్మదిన వేడుకలు
హైదరాబాద్, సెప్టెంబర్ 19: ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ జన్మదినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ సీతక్క అశోక్‌తో కలిసి కేక్ కట్ చేసి, ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply