అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్‌లకు ప్రశంసా పత్రాలు అందజేత
మంథని | అయుష్ 24 న్యూస్
ఇటీవల మంథని బోయిన్‌పేట బొక్కలవాగు ప్రమాదంలో ఓ బాలికను ప్రాణాలకు తెగించి కాపాడిన అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్‌లను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష, IAS, తెలంగాణ ప్రభుత్వ విప్ విజయరామారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వారి సాహసాన్ని అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రమాద సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాలికను రక్షించేందుకు ముందుకు వచ్చి చూపిన ధైర్యసాహసాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రశంసించారు.
బాలిక ప్రాణాలను కాపాడేందుకు అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్ చేసిన సాహసం సమాజానికి స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని సూచించారు.
ఈ సందర్భంగా బోయిన్‌పేట ప్రజల తరఫున సహకరించిన ప్రతి ఒక్కరు, ఉన్నతాధికారులకు ఇండిపెండెంట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply