Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి
Home › బ్రేకింగ్ న్యూస్ › బెల్టు షాపుల పూర్తిస్థాయి మూసివేతపై గ్రామ పంచాయతీ నిర్ణయం
బ్రేకింగ్ న్యూస్

బెల్టు షాపుల పూర్తిస్థాయి మూసివేతపై గ్రామ పంచాయతీ నిర్ణయం

01:15 మధ్యాహ్నం PM

అక్రమంగా నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

ఎక్లాస్‌పూర్, సెప్టెంబర్ 20 (ప్రతినిధి): గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు బెల్టు షాపులను పూర్తిస్థాయిలో మూసివేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్ 20న నిర్వహించిన అత్యవసర సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు పంచాయతీ పాలకవర్గం తెలిపింది.

ఇప్పటికే సెప్టెంబర్ 15న బెల్టు షాపుల నిర్వాహకులు తమ దుకాణాలను మూసివేస్తామని గ్రామ పంచాయతీకి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే కొందరు నిర్వాహకులు ఇప్పటికీ బెల్టు షాపులను కొనసాగిస్తున్నట్లు గ్రామస్థులు పంచాయతీ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఇకపై బెల్టు షాపులను నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పంచాయతీ పాలకవర్గం వెల్లడించింది.

బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందించే వారికి ₹2,000 ప్రోత్సాహక బహుమతి అందజేస్తామని ప్రకటించింది. అయితే బెల్టు షాపు నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తికి ₹20,000 జరిమానా విధిస్తామని పంచాయతీ నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం, ప్రజల ఆరోగ్యం, గ్రామ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బెల్టు షాపుల నియంత్రణకు ప్రజలు సహకరించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం కోరింది.

ఇట్లు:
గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఎక్లాస్‌పూర్

— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 137🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App