చర్చి అభివృద్ధికి రూ.50 వేల ఆర్థిక సాయం.. ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
ఎస్.ఆర్. పురం మండలం, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్:
స్వధర్మాన్ని ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తూ మత సామరస్యాన్ని చాటుకోవాలని జనసేన జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న పేర్కొన్నారు. ఎస్.ఆర్. పురం మండలం మేధవాడ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రాజరాజేశ్వరీ అమ్మవారి దీక్షలో ఉన్న డాక్టర్ యుగంధర్ పొన్న.. మేధవాడ గ్రామంలోని క్రైస్తవ సోదరుల ఆహ్వానం మేరకు చర్చి ప్రాంగణాన్ని సందర్శించారు. చర్చి పునర్నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం తన సొంత నిధుల నుంచి రూ.50,000 ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు.
ప్రజా సమస్యలపై అర్జీల స్వీకరణ
అనంతరం మేధవాడ గ్రామ ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలతో పాటు స్థానిక క్లీన్ అండ్ గ్రీన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యక్తిగత అర్జీలను స్వీకరించారు.

ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని డాక్టర్ యుగంధర్ పొన్న హామీ ఇచ్చారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గంగమ్మ గుడి చైర్మన్ జలంధర్ నాయుడు, జిల్లా కార్యదర్శి రాఘవ, మండల ఐటీ కో-ఆర్డినేటర్ మురుగేష్తో పాటు ప్రకాష్, రాజేంద్ర, చరణ్, బాలాజీ, కుప్పయ్య, ప్రసాద్, కిరణ్, గోపి, అరవింద్ బాబు, శేఖర్, చిన్న, జయలక్ష్మి, ఉష, మహేశ్వరి, రాపిడ్ తులసి, కోకిల, పుష్ప, చిరంజీవి, వెంకి తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం సమాజానికి అవసరమని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
— అయుష్ 24 న్యూస్









Leave a Reply