ఇప్పటివరకు రూ.29,600 విరాళాల సేకరణ.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ.72,700 సహాయం
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన సీనియర్ కుంగ్‌ఫూ, కరాటే మాస్టర్ విక్రమ్ గారి కుమార్తె మాస్టర్ భవిత సెప్టెంబర్ 5న అకాల మరణం చెందడంతో ఆమె కుటుంబాన్ని ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరాటే, కుంగ్‌ఫూ మాస్టర్లు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు.
మాస్టర్ భవిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు మార్షల్ ఆర్ట్స్ రంగానికి చెందిన పలువురు తమ వంతు విరాళాలను అందిస్తున్నారు. ఈ నెల 20న కాటేదాన్ ఇండోర్ స్టేడియంలో మాస్టర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీల సందర్భంగా మాస్టర్ విక్రమ్ గారికి సేకరించిన మొత్తాన్ని అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇంకా ఎవరైనా సహాయం చేయదలచిన వారు రేపు ఉదయం వరకు తమ వంతు సహాయం అందించాలని కోరారు.
తెలంగాణ నుంచి ఇప్పటివరకు విరాళాలు అందించిన వారు
- మాస్టర్ నాగేష్ మల్లూరి – మెదక్ – ₹10,000
- మాస్టర్ శ్రీధర్ – ₹3,000
- మాస్టర్ కేశవ్ గౌడ్ – ₹2,000
- మాస్టర్ అమర్ సింగ్ – ₹1,000
- మాస్టర్ రాజు యాదవ్ – ₹1,000
- మాస్టర్ ఆర్. ప్రశాంత్ – ₹1,000
- మాస్టర్ కన్నన్ గౌడ్ – ₹1,000
- మాస్టర్ సిరికొండ ఉపేందర్ – ₹1,000
- మాస్టర్ డి. ఆంజనేయులు – ₹1,000
- మాస్టర్ పి. శ్రీరాములు – ₹1,000
- మాస్టర్ వినోద్ – ₹1,000
- మాస్టర్ అశోక్ రోడే – ₹600
- మాస్టర్ విటల్ – ₹500
- మాస్టర్ లక్ష్మణ్ – ₹500
- మాస్టర్ సాయి యాదవ్ – ₹500
- సామల కుమారస్వామి – ₹500
- మాస్టర్ శ్రీకాంత్ – ₹500
- మాస్టర్ బాలరాజ్ – ₹500
- కృష్ణ ఇన్స్టాల్ ట్రైలర్ – ₹500
- మాస్టర్ రవి కిరణ్ గౌడ్ – ₹500
- మాస్టర్ U. శైలు – ₹500
- మాస్టర్ గోవిందరాజు – ₹500
- మాస్టర్ నర్సింగ్ రావు – ₹500
- మాస్టర్ కిన్నెర రవి – ₹500
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ.72,700 సహాయం
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం తరఫున రూ.29,600, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున రూ.43,100 విరాళాలు సేకరించగా, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కలిపి మొత్తం రూ.72,700 ఆర్థిక సహాయం సమకూరింది.
మాస్టర్ భవిత కుటుంబానికి అండగా నిలిచి తమ వంతు సహాయం అందించిన ప్రతి ఒక్క మాస్టర్‌కు నిర్వాహకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయంలో మార్షల్ ఆర్ట్స్ కుటుంబం ఒక్కటిగా నిలిచి మానవత్వాన్ని చాటడం అభినందనీయమని పేర్కొన్నారు.
🙏 మాస్టర్ భవిత కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply