దేవరకొండ, ఆగస్టు 18 – అయుష్ 24 న్యూస్
దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న భాస్కర్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అధ్యాపకుడిపై దాడి చేసినట్లు సమాచారం.

భాస్కర్ గతంలో కూడా విద్యార్థుల పట్ల ఇదే విధంగా ప్రవర్తించేవాడని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. అనంతరం కళాశాల విద్యార్థులతో కలిసి రోడ్డుపై నిరసన చేపట్టి ధర్నా నిర్వహించారు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులు విద్యను అభ్యసించే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యాబోధన చేయాల్సిన అధ్యాపకుడు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు పేర్కొన్నారు.
అధ్యాపకుడు భాస్కర్‌పై వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ప్రిన్సిపాల్ వివరణ
ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా, ఫిర్యాదు అందిందని, అధ్యాపకుడిపై పూర్తిస్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అధ్యాపకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధ్యాపకుడు భాస్కర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.
కళాశాలను సందర్శించిన డీఏఈఓ
ఘటన విషయం తెలుసుకున్న డీఏఈఓ దస్రు నాయక్ దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించారు. విద్యార్థుల పట్ల అధ్యాపకుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ప్రిన్సిపాల్‌తో చర్చించి ఘటనపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, విచారణలో వాస్తవాలు తేలిన అనంతరం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
గమనిక: అధ్యాపకుడిపై వచ్చిన ఆరోపణలు విచారణలో నిర్ధారణ కావాల్సి ఉంది.










Leave a Reply