ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్ష
జహీరాబాద్, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): జహీరాబాద్ పట్టణంలోని రామ్‌నగర్‌లో నిర్వహించిన శ్రీ భూ లక్ష్మీ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా. ఏ. చంద్రశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని డా. ఏ. చంద్రశేఖర్ ఆకాంక్షించారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెప్పింది. కార్యక్రమానికి భక్తులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల అధ్యక్షుడు హుగ్గేల్లి రాములు, పవన్ రాథోడ్, పట్టణ అధ్యక్షుడు నరేష్ గౌడ్, మాజీ పట్టణ అధ్యక్షుడు కండేం నర్సింలు, సర్పంచులు ప్రేమ్ రాథోడ్, రాజ్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్ శేఖర్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply