గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి: ఉమ్మడి ఖమ్మం జిల్లా సాధు సంత్‌ల జేఏసీ
లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 5 (అయుష్ 24 న్యూస్): గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ధర్మ పరిరక్షణకు బంజారా సాధు సంత్‌లు చేస్తున్న సేవలను గుర్తించి, వారికి ప్రభుత్వం గౌరవ వేతనం అందించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా సాధు సంత్‌ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. ప్రతి సాధు సంత్‌కు దీప, ధూప, నైవేద్యం కోసం నెలకు రూ.25 వేల గౌరవ వేతనం ఇవ్వాలని కోరింది.

లక్ష్మీదేవిపల్లిలోని మార్కెట్ యార్డులో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా సాధు సంత్‌ల సమావేశంలో నూతన జేఏసీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్‌గా తేజావత్ రాములు నాయక్, గౌరవాధ్యక్షులుగా బానోత్ చందు, గుగులోత్ బిచ్చా, వైస్ చైర్మన్లుగా మాళోత్ రమేష్, జాటోత్ శంకర్ ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా భూక్య బాలు, ట్రెజరర్‌గా ధరమ్‌సోత్ లచ్చు నియమితులయ్యారు. కార్యదర్శులుగా బానోత్ బద్య, బానోత్ హతీరాం, బానోత్ పాండు, ధరావత్ సక్రు, బానోత్ మిట్టు, భూక్య బాలు, సపావట్ సోమ్లా, ధరావత్ రాందాస్, లకావత్ దేస్యలను నియమించారు.
గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి పిలుపు
ఈ సందర్భంగా నూతన చైర్మన్ తేజావత్ రాములు నాయక్ మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణ కోసం గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సాధు సంత్‌లు ధర్మ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

అయితే సాధు సంత్‌లకు తగిన ఆర్థిక ప్రోత్సాహం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వారి సేవలను గుర్తించి ప్రతి సాధు సంత్‌కు నెలకు రూ.25 వేల గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో జేఏసీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధర్మ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు.
నూతన కమిటీకి ఘన సన్మానం
అనంతరం నూతనంగా ఎన్నికైన జేఏసీ కమిటీ సభ్యులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంజారా సంఘాల జేఏసీ చైర్మన్ బానోత్ వీరు నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు మాళోత్ శివ నాయక్, సేవాలాల్ సేన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ కృష్ణ, సోషల్ మీడియా జేఏసీ కో-కన్వీనర్ వినోద్ నాయక్, రాకేష్ తదితరులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో సాధు సంత్‌లు ఆంగోత్ రాజు, బిచ్చా, గురు ప్రసాద్, రాందాస్, రాంపాల్, సీతారాం, దస్రు, బాలు, వాంకుడోత్ బాలు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply