నకిరేకల్, సెప్టెంబర్ 8: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
నకిరేకల్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ మాట్లాడుతూ.. స్పీకర్‌పై తాతా మధు చేసిన వ్యాఖ్యలకు ఆయన దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తాతా మధును వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు దైద రవీందర్ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన శాసనసభ స్పీకర్ పదవికి గౌరవం ఉండాలని, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.
– అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, నకిరేకల్









Leave a Reply